Breakdown Moments Of Jr NTR’s “Aravindha Sametha Teaser”

Breakdown Moments Of Jr NTR’s “Aravindha Sametha Teaser” 

త్రివిక్రమ్ శ్రీనివాస్ మరియు జూ.ఎన్టీఆర్ కాంబినేషన్ అనగానే ఒకవైపు తారక్ అభిమానులు, మరోవైపు ప్రేక్షకులు అంత మంచి యాక్షన్ ఉన్న సినిమా అని భావిస్తున్నారు. స్వాతంత్ర దీనోత్సవం సందర్బంగా ఈ చిత్ర బృదం ఒక టీజర్ ని రిలీజ్ చేశారు, ఈ టీజర్ తో అందరికి ఒక క్లారిటీ వచ్చేసింది.

ఈ సినిమా టీజర్ గురించి మాట్లాడుకునేముందు ఒక ఫ్లాష్ బ్యాక్ గురించి మాట్లాడుకోవాలి. మన టాలీవుడ్ దర్శకదీరుడు ఎస్ ఎస్ రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూ లో సుకుమార్ మరియు త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ , ” సుక్కు, త్రివిక్రమ్ గారు ఔట్ అండ్ ఔట్ మాస్ సినిమా గనుకా తీస్తే మేం అందరం దుకాణం సర్దుకోవాల్సిందే” అని అన్నారు.

మన జక్కన్న గారి మాటలను వాళ్ళు సీరియస్ గా తీసుకున్నారో లేకా వాళ్ళు మాములుగా రాసుకున్న కథలో తెలియదుగాని సుకుమార్ గారు “రంగస్థలం” లాంటి ఒక మంచి సినిమా తీసి టాలీవుడ్ ఇండస్ట్రీ మీద ఒక దండయాత్ర చేసారు. ఇక ఇప్పుడు మన గురూజీ, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు “అరవింద సమేత-వీర రాఘవ” తో మరో దండయాత్ర చేయడానికి సిద్ధం అవుతున్నారు. టీజర్ చూసిన వాళ్లకి ఈ సినిమా మాస్, ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అని అర్థం అవుతుంది.

Breakdown Things:

1. ఈ టీజర్ లోని మొదటి సీన్ చూస్తేనే చాలు ఇది ఒక మాస్ సినిమా అని అర్ధం అవుతుంది. త్రివిక్రమ్ గారి మార్క్ టీజర్స్ అంటే కొంచం క్లాస్ గానే మొదలవుతాయి అని మనకు మిగతా పాత టీజర్స్ చూస్తేనే తెలుస్తుంది కానీ “అరవింద సమేత” టీజర్ మాత్రం చేతిలో కత్తితో మొదలవుతుంది. ఆ స్లో మోషన్ లో తారక్ కత్తితో అరటి చెట్టుని నరుకుతుంటే చుట్టూ పక్కన అందరు పరిగెడుతుంటారు.

Aravinda Sametha Official Trailer
2. జగపతి బాబు గారు డైలాగ్స్ చెప్తుంటే తారక్ ని ఎలివేట్ చేయడం ఈ టీజర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లింది.

 Goosebump Factors:

1. “మండు వేసవి గొంతులో దిగితే ఎట్టుంటాదో తెలుసా.?” అంటూ జగపతి బాబు గారి వాయిస్ కి మ్యాచ్ చేస్తూ నెక్స్ట్ షార్ట్ లో బ్రిడ్జి బ్లాస్ట్ సీన్ Goosebumps-1.
Aravinda Sametha Official Trailer
2. “మచ్చలపులి మొహం మీద గాండ్రిస్తే ఎట్టుంటాదో తెలుసా.?” ఈ డైలాగ్ ని మ్యాచ్ చేస్తూ తారక్ కొడవలి తో ఇద్దరినీ చంపేసే సీన్ Goosebumps-2.
Aravinda Sametha Official Trailer
3. “మట్టి తుఫాన్ చెవిలో మోగితే ఎట్టుంటాదో తెలుసా.?” ఈ లైన్స్ చెప్తున్నప్పుడు తారక్ కుర్చితో చేసే ఫీట్ Goosebumps-3.
Aravinda Sametha Official Trailer
4. “కనపడ్డావా కనికరిస్తానేమో, ఎంటపడ్డానా నరికేస్తా ఒబా” ఈ డైలాగ్ తో హీరోయిజం చూపించడంలో గురూజీ తరువాతే ఎవరైనా. అచ్చమైన రాయలసీమ యాస తారక్ చెప్పిన ఆ డైలాగ్ సినిమా మీద హోప్స్ పెంచేసాయి.
Aravinda Sametha Official Trailer

End Of The Breakdown:

రం… రుధిరం, రం…సిశిరం, రం… సమరం, అంటూ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వచ్చినప్పుడు తారక్ సిక్స్ ప్యాక్ చేసింగ్ సీన్ అయితే ఊర మాస్ .
రుధిరం, సిశిరం, సమరం అంటే ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే దసరా వరకు ఆగాల్సిందే.

Aravinda Sametha Official Trailer

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *