Naga Chaitanya and Samantha New Movie

Naga Chaitanya and Samantha New Movie || Chay Sam New Film 

ఆన్ స్క్రీన్ అయినా, ఆఫ్ స్క్రీన్ అయినా అభిమానులను మెప్పించే జంట చై-సామ్. అందంతో, తన నటనతో కుర్రకారులను మత్తులోకి దించి పిచ్చెక్కించిన సమంత, అక్కినేని వారి అబ్బాయిని పెళ్లి చేసుకున్నాక ఎక్కువగా తెరమీద కనిపించడం మానేసింది.

అక్కినేని నాగచైతన్య మరియు సమంత జంటగా నటిస్తే ఎలా ఉంటుందో మన వేరే చెప్పనక్కరలేదు. చాలా రోజుల తరువాత ఈ రియల్ లైఫ్ జోడి కలిసి ఒక చిత్రానికి హీరో, హీరోయిన్లు గా నటించడానికి ఒప్పుకున్నారని మనకి తెలిసిన సంగతే.  నివేద థామస్ మరియు న్యాచురల్ స్టార్ నాని కాబినేషన్ లో వచ్చిన ” నిన్ను కోరి ” సినిమాతో మంచి ఘనవిజయాన్ని అందుకున్న దర్శకులు శివ ఈ చిత్రాన్ని తెరకెక్కించడం గమనార్హం.

పెళ్ళికి ముందు నాగ చైతన్య మరియు సమంత ” ఏ మాయ చేసావే”, “మనం”,  “ఆటో నగర్ సూర్య” వారి పలు చిత్రాల్లో కలిసి నటించిన విషయం మనకు తెలిసిందే. వివాహం తదుపరి వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రానికి ప్రేక్షకుల్లో ఉత్సహాన్ని రేకెత్తిస్తుంది.

తాజాగా ఈ జోడి నటించనున్న చిత్రం గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రానికి “మజిలీ” అనే పేరుని ఖరారు చేసినట్లు ఫిలింనగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయం మీద చిత్ర యూనిట్ గాని మరియు దర్శకులు శివ గాని ఇంతవరకి స్పందించలేదు. త్వరలోనే ఈ సినిమా పేరును అధికారికంగా ప్రకటిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *