NTR Kathanayakudu 2019 Telugu Movie Review

NTR Kathanayakudu 2019 Telugu Movie Review – Nandamuri Balakrisha – Vidya Balan | Cinemaizm

నటీనటులు : బాలకృష్ణ, విద్యాబాలన్‌, రానా, సుమంత్‌, భరత్‌రెడ్డి, దగ్గుబాటి రాజా వెన్నెల కిషోర్‌, పూనమ్‌ బాజ్వా, మంజిమా మోహన్‌, నరేష్‌, మురళీశర్మ, క్రిష్‌, రవికిషన్‌, శుభలేఖ సుధాకర్‌, రవిప్రకాష్‌, చంద్ర సిద్ధార్థ, భానుచందర్‌, ప్రకాష్‌రాజ్‌, కె.ప్రకాష్‌, ఎన్‌.శంకర్‌, దేవి ప్రసాద్‌ తదితరులు
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ : జ్ఞానశేఖర్‌ వీఎస్‌
ఎడిటింగ్‌ : అర్రం రామకృష్ణ
సంభాషణలు : బుర్రా సాయిమాధవ్‌
నిర్మాత : నందమూరి బాలకృష్ణ, సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి
దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి
సంస్థ : ఎన్‌బీకే ఫిల్స్మ్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా

!!ఇంట్రో!!
తెలుగువారు ఉన్నంత సేపు క‌చ్చితంగా వినిపించే పేరు ఎన్టీఆర్ ఆ మ‌హాన‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడిగా మారి ప్ర‌జ‌ల‌కు ఎంత సేవ చేశారో అంద‌రికి తెలిసిందే ఆయ‌న గురించి ఎంత చెప్పినా త‌క్కువ అని చెప్పాలి.. తెలుగువారి పేరును అఖండ ప్ర‌ఖ్యాతికి తీసుకువెళ్లిన గొప్ప యుగ‌పురుషుడు వెండితెర‌పై జాన‌ప‌ద‌, పౌరాణిక‌, సాంఘిక ఇలా జోన‌ర్ ఏదైనా త‌న‌దైన న‌ట‌న‌తో చెర‌గ‌ని ముద్ర‌వేసిన గొప్ప న‌టుడు. ఆయ‌న పోషించిన‌న్ని పౌరాణిక పాత్ర‌లు మ‌రో న‌టుడు చేయ‌లేదంటే అతిశ‌యోక్తి కాదు. మరి అలాంటి ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను వెండితెరపై ఆవిష్క‌రించిన ప్ర‌య‌త్న‌మే ఎన్టీఆర్ క‌ధానాయ‌కుడు. ఆయ‌న త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్‌లో న‌టించిన య‌న్‌.టి.ఆర్ బ‌యోపిక్ మొద‌టి భాగం క‌థానాయ‌కుడు ఈరోజు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? బాల‌య్య న‌ట‌న ఎలా ఉంది అనేది చూద్దాం.

!!క‌థ‌!!
ఎన్టీఆర్ జీవితం తెరిచిన పుస్త‌కం. దాని గురించి అభిమానుల‌కు, తెలుగు సినీ ప్రేక్ష‌కుల‌కు తెలియ‌నిది ఏమీ లేదు. ఎన్టీఆర్ సినీ నేప‌థ్యం గురించి అంద‌రికీ తెలిసిందే. అయితే, ఆయ‌న కుటుంబానికి ఎంత విలువ ఇస్తారు. ముఖ్యంగా బ‌స‌వ‌తార‌క‌మ్మ‌కు ఆయ‌న ఎంత ప్రాధాన్యం ఇస్తార‌న్న‌ది ఎవ‌రికీ తెలియ‌దు. ఆ విశేషాల‌న్నీ య‌న్‌.టి.ఆర్‌: క‌థానాయ‌కుడులో చూస్తాం…. ఒక ర‌కంగా ఇది ఎన్టీఆర్ క‌థ అన‌డం క‌న్నా బ‌స‌వ‌తార‌కం క‌థ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఆమె కోణంలో నుంచి ఈ క‌థ మొద‌లైంది.

ఆ కోణంలోనే ఈ క‌థ సాగుతుంది. బ‌స‌వ‌తార‌కం(విద్యాబాల‌న్‌) క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతూ ఉంటుంది. ఆమె ఆరోగ్య ప‌రిస్థితి గురించి హ‌రికృష్ణ‌(క‌ల్యాణ్‌రామ్‌) తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతూ క‌నిపించ‌డంతో సినిమా ప్రారంభ‌మ‌వుతుంది. అప్పుడు చికిత్స తీసుకుంటున్న బ‌స‌వ‌తార‌కం ఎన్టీఆర్ ఆల్బ‌మ్‌ను తిర‌గేస్తూ ఉండ‌టంతో య‌న్‌.టి.ఆర్‌… అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది. ఎన్టీఆర్ బాల‌కృష్ణ‌ ఎలా ఎదిగారు? సినిమాల‌పై వ్యామోహం ఎందుకు పెరిగింది? సినిమాల్లో ఎలా రాణించాడు? ఒక సాధార‌ణ రైతు బిడ్డ గొప్ప స్టార్‌గా ఒక్కో అడుగు వేసుకుంటూ ఎలా వెళ్లాడన్న‌ది క‌థ‌. ఎన్టీఆర్ ప్ర‌స్థానంతో మొద‌లైన చిత్రం.. ఎన్టీఆర్ తెలుగుదేశం ప్ర‌క‌ట‌న‌తో ముగుస్తుంది. మ‌రి తండ్రి పాత్ర‌లో బాల‌కృష్ణ ఎలా మెప్పించారు. బ‌స‌వ‌తార‌కంగా విద్యాబాల‌న్ ఎలాంటి న‌ట‌న క‌న‌బ‌రిచింది. తెలుగువారి అభిమాన న‌టుడు ఎన్టీఆర్ సినీ జీవితం ఎలా సాగిందో తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ఎన్టీఆర్‌-బ‌స‌వ‌తారకం మ‌ధ్య ఉన్న అనుబంధం చూసి ఆశ్చ‌ర్య‌పోతారు. ఒక భ‌ర్త‌.. భార్యకు ఇంత‌లా ప్రాధాన్యం ఇస్తారా? అనిపిస్తుంది. ఎన్టీఆర్ జీవితంలో చోటు చేసుకున్న ప్ర‌తి మ‌లుపు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు చూపించాడు ద‌ర్శ‌కుడు. మనదేశం, రైతుబిడ్డ చిత్రాల్లో ఎన్టీఆర్‌కు ఎలా అవకాశం వచ్చింది? తోటరాముడి పాత్ర ఎలా దక్కింది. కృష్ణుడిగా ఎన్టీఆర్‌ కనిపించినప్పుడు ఎదురైన సంఘటనలను దర్శకుడు చాలా చక్కగా చూపించాడు.. త‌న‌యుడు చావుబ‌తుకుల్లో ఉన్నా స‌రే నిర్మాత న‌ష్ట‌పోకూడ‌ద‌ని ఉద్దేశంతో షూటింగ్‌కు వ‌చ్చిన ఒక మ‌హాన‌టుడిని తెర‌పై చూస్తాం.. ఎన్టీఆర్ రాజ‌కీయాల్లో ఎందుకు రావాల‌ని అనుకుంటున్నాడు.. అందుకు ప్రేరేపించిన అంశాలు ఏంటి? క‌థానాయ‌కుడి జీవితం నుంచి రాజ‌కీయ నాయ‌కుడిగా ఎలా ఎద‌గాల‌నుకున్నాడ‌ది ప్రీక్లైమాక్స్‌లో క‌నిపిస్తుంది. దివిసీమ ఉప్పెన నేప‌థ్యాన్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు, గుండెల‌ను మెలి తిప్పేలా చూపించాడు ద‌ర్శ‌కుడు. అభిమానుల‌కు తెలిసిన విషయాలు, తెలియ‌ని విష‌యాలు అత్యంత నాట‌కీయంగా, స‌హ‌జంగా ద‌ర్శ‌కుడు తెర‌పైకి తీసుకొచ్చాడు.

విశ్లేష‌ణ‌!!
ఎన్టీఆర్ చ‌రిత్ర‌ను సినిమా తీయాల‌న్న‌ది ఒక గొప్ప ఆలోచ‌న‌. దానికి త‌గిన న‌టీన‌టులు సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు దొరికారు. ఎన్టీఆర్ జీవితంలో ఏం చూడాల‌నుకుంటున్నారో.. ఏం తెలుసుకోవాల‌నుకుంటారో.. అవ‌న్నీ తెర‌పై చూపించాడు ద‌ర్శ‌కుడు. ఎన్టీఆర్ సినిమా రంగ ప్ర‌వేశం చేసిన త‌ర్వాత ఆయ‌న పోషించిన పాత్ర‌ల‌న్నీ ప్ర‌తి ఐదు నిమిషాల‌కోసారి మ‌న‌కు ద‌ర్శ‌న‌మిస్తాయి. సినిమాలో బాల‌కృష్ణ న‌టించాడు అన‌డం కంటే జీవించాడు అని చెప్పాలి.

బ‌స‌వ‌తార‌కంగా విద్యాబాల‌న్ ఈ సినిమాకు ప్రాణం పోశారు. ఆమెను ఎంచుకోవ‌డ‌మే ఈ సినిమాకు ప్ర‌ధాన బ‌లం. ఎందుకంటే ఇది బ‌స‌వ‌తార‌కం క‌థ కాబ‌ట్టి. ఈ పాత్ర త‌ర్వాత అభిమానుల‌ను ఎక్కువ‌గా ఆక‌ట్టుకునేది అక్కినేని నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌. అక్కినేనిగా సుమంత్ చాలా చ‌క్క‌గా క‌నిపించారు. కొన్ని స‌న్నివేశాల్లో నిజంగా ఏయ‌న్నారేమోన‌నిపించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఎన్టీఆర్‌-ఏయ‌న్నార్‌ల అనుబంధాన్ని కూడా తెరపై అందంగా ఆవిష్క‌రించారు. ఒక ఏయ‌న్నార్ బ‌యోపిక్‌లా కూడా అనిపిస్తుంది. చంద్ర‌బాబుగా రానా పాత్ర చివ‌రిలో త‌ళుక్కున మెరుస్తుంది. ద్వితీయార్థానికి ఆ పాత్ర ఆయువుప‌ట్టు అప్పుడే తెలిసిపోతుంది. పేరున్న న‌టీన‌టులంద‌రూ చిన్న చిన్న పాత్ర‌ల్లో మెరిసి, ఆ పాత్ర‌ల విశిష్ట‌త‌ను పెంచారు.

!!బ‌లాలు!!
ఎన్టీఆర్ ఎదిగిన తీరు, గెట‌ప్పులు
భావోద్వేగ స‌న్నివేశాలు
ఎన్టీఆర్‌-బ‌స‌వ‌తార‌కం సన్నివేశాలు
ఎన్టీఆర్‌-ఏయ‌న్నార్‌ల మైత్రి
సంభాష‌ణలు
ద‌ర్శ‌క‌త్వం

!!బ‌ల‌హీన‌త‌లు!!
నిడివి ఎక్కువ‌గా ఉండ‌టం

రేటింగ్ 3
ఇది సినిమా కాదు చ‌రిత్ర

 

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *