అనుష్క – “నిశ్శబ్దం” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

అనుష్క ముఖ్య పాత్రలో నటిస్తున్న “నిశ్శబ్దం” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల.

అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా”నిశ్శబ్దం”. ఈ సినిమాను కోన ఫిల్మ్ కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు హేమంత్ మధూకర్ దర్శకత్వం నిర్వహిస్తున్నాడు.ఈ సినిమాలో అనుష్క ఒక చిత్రకారినిగా కనిపించనుంది.పోస్టర్లో కూడా “సాక్షి మ్యూట్ ఆర్టిస్ట్” అని రాసుంది, పోస్టర్ డిఫరెంటు లుక్తో కనిపించడంతో సినిమాలో కొత్త కంటెంట్ ఉండబోతోందని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ అంతా కూడా విదేశాల్లో జరుగుతుందట. సినిమాలో ముఖ్య నటులుగా అంజలి, షాలిని పాండే, సుబ్బరాజు నటిస్తున్నారు. ఈ సినిమాను వివిధ భాషల్లో విడుదల చేయనున్నారు . లేడీ ఓరయెంటెడ్ సినిమాల్లో నటించడం, విభిన్న పాత్రల్లో నటించడం స్వీటికి కొత్తేం కాదు కాబట్టి సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచాలున్నాయి.

-Ajay

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *