బిగ్బాస్ పై విరుచుకుపడ్డ ఇంటి సభ్యులు!

బిగ్బాస్ పై విరుచుకుపడ్డ ఇంటి సభ్యులు!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో రెండు సీజన్ లు పూర్తి చేసుకుని మూడో సీజన్లో కి అడుగుపెట్టింది. ఈ సీజన్లో ఇంటి సభ్యులు ఒకరి తరవాత ఒకరు సీరియస్ అవుతున్నారు. రీసెంట్ గా పునర్ణవి తనకు ఇచ్చిన టాస్క్ సరిగ్గా పూర్తి చేయలేదని పునర్నవి కి షూ పాలిష్ చేయాలని ఆదేశించారు. పునర్ణవీ తాను ఎలాంటి పనులు చేయనని, కావాలంటే బయటికి పంపేయండని బిగ్బ్బాస్ కు తేల్చి చెప్పింది. ఎంటి ఈ తొక్కలో టాస్క్ లు నేను అడను మీరే ఆడుకోండి అని ఫైర్ అయింది.ఇదిలా ఉండగా కమెడియన్ మహేష్ విట్ట కూడా బిగ్ బాస్ కు తాను చెప్పులు తుడవడానికి రాలేదని “అంత చీప్ గా కనిపిస్తున్నానా”అంటూ బిగ్ బాస్ పైకి సీరియస్ అయ్యాడు. ఈ రోజు చెప్పులు తుడవమంటున్నరు రేపు మీ చెడ్డీలు పిండమంటారా అన్నాడు.కాగా ముందు రెండు సీజన్ లలో కూడా ఇంటి సభ్యులు బాస్ పైకి ఫైర్ అయిన విషయం మనకు తెలిసిందే. సీజన్ 1లో శివబాలాజీ, సీజన్ 2లో బాబూ గోగినేని ఇలా బిగ్ బాస్ పై మండిపడ్డారు. ఆ తరవాత బిగ్ బాస్ మాట్లాడగా కూల్ అయ్యారు మరి ఇప్పుడున్న సభ్యులు ఎం చేస్తారో చూడాలి.

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *