Bigg Boss Babu Gogineni About Kaushal Army

Bigg Boss Babu Gogineni about Kaushal Army || Bigg Boss Telugu Kaushal Army

బుల్లి తెర మీద అన్ని భాషల్లో విజయం అందుకున్న బిగ్ బాస్ తెలుగు లో మంచి విజయాన్ని సాధించింది . ఇపుడు బిగ్ బాస్ ప్రోగ్రాం బుల్లితెరకు దడపుట్టిస్తుంది . జనాలందరూ ఈ బిగ్ బాస్ ఫీవర్ లోనే ఉన్నారు . సీజన్ 1 లాగే సీజన్ 2 కూడా మంచి విజయంతోనే దూసుకెళ్తుంది. నాచురల్ స్టార్ అని పేరు ఉన్న నాని గారు కూడా తనదైన స్టైల్ లో దూసుకెళ్తున్నారు .

అయితే ఈ ప్రోగ్రాం నుండి ఇప్పటికే చాలా మంది కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయినా విషయం తెలిసిందే , బయటకి వచ్చాక మీడియా కి ఇంటర్వ్యూల రూపంలో ఇంట్లో ఎలా ఉంటుందో వివరిస్తూ ఉన్నారు . ఇక విషయానికి వస్తే బాబు గోగినేని గారు కూడా ఒక కంటెస్టెంట్ గా బిగ్ బాస్ లోకి వెళ్లి ఎలిమినేట్ అయి తిగిరావడం మన అందరికి తెలిసిన విషయమే.

బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక బాబు గారు ఒక ప్రముఖ ఛానల్ తో మాట్లాడుతూ తనదైన రీతిలో ఘాటుగా స్పందించారు . నేను బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్ళినపుడు ఎంత ఆనందంగా ఉన్నానో ఎలిమినేట్ అయి బయటకు వచ్చాక కూడా అంతే ఆనందంగా ఉన్నాను అని చెప్పుకొచ్చారు . “బిగ్ బాస్” అనేది ఒక ప్రెజర్ కుక్కర్ లాంటిది దాంట్లో మనం ఉండగలమా…లేదా.? అనే విషయం కేవలం ఇంట్లోకి వెళ్లిన వాళ్ళకే తెలుసుకునే అవకాశం ఉంది. అందరితో పాటు నాకు ఆ అవకాశం దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ తిండి , నిద్ర ఉండదు … నేనైతే ఏకంగా 5కిలోలు తగ్గిపోయాను అని చెప్పుకొచ్చారు.

అయితే ప్రేక్షకుల్లో చాలామంది ఇంట్లో జరిగేవి చూసి వాళ్లకూ ఇష్టమైన వారినకి మాత్రమే ఓట్ వేస్తూ వాళ్ళు బిగ్ బాస్ విన్నర్ అవాలి అని చూస్తున్నారు . నాకు కుడా ఈ విషయం నేను బయటకు వచ్చాకే తెలిసింది అని బాబు గోగినేని గారి తెలిపారు. ప్రేక్షకుల్లో కొందరు ఆర్మీలు తయారు చేసి నచ్చని వాళ్ళను టార్గెట్ చేసి ఒక్కొక్కరిగా బయటకు పంపిస్తున్నారు.
నేను బయటకు రావటానికి కూడా ఆర్మీనే కారణం అని నేను నమ్ముతున్నాను .ఆర్మీ అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు భారత దేశ సైనిక దళంలో చేరితే దేశానికి ఉపయోగం ఉంటుంది కానీ కొందరు గ్రూప్ లుగా ఫామ్ అయ్యి ఆర్మీ పెట్టి ఎలిమినేటి చేస్తే ఏంటి ఉపయోగం అని కౌశల్ ఆర్మీ మీద తీవ్రంగా మండిపడ్డారు . ఇంట్లో ఉన్న వాళ్లలో ఎవరు తెలుస్తే ఏంటి .? దీనికి ఆర్మీ అనే మాట చాలా పెద్దది . నేను ఈ విధానాన్ని ఖండిస్తున్నాను , మనం మనలాగే ఉండాలి , దూషించటం సరియైన విధానం కాదు, మీరు చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అంటూ బాబు గారు హెచ్చరించారు.

#KaushalArmy  #BiggBossTeluguKaushalArmy #BiggBossTeluguVote

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *