Reason Behind International Women’s Day | International Women’s Day 2018

మహిళా దినోత్సవం వెనుక కారణం..?

Reason Behind International Women’s Day | International Women’s Day 2018 | International Womens Day  

సమాజానికి ఒక నిర్దేశిక సందేశం ఇవ్వడానికి అనేక దినోత్సవాలు చేస్తూ ఉంటాం…సాంప్రదాయాలు కాపాడుకోవడానికి పండుగలు చేస్తాం… ఏది చేసిన ఎక్కడ చేసిన ప్రపంచ మానవాళి శ్రేయస్సు కోసమే నిర్దేశించబడుతుంది… పుట్టినరోజు, పెళ్లిరోజు, మదర్స్ డే, ఫాదర్స్ డే, ప్రేమికుల రోజు, స్నేహితుల రోజు, ఈ రోజుల్లో మనం ప్రత్యేకంగా వాళ్ళ గురించి అలోచించి, వాళ్ళని కొనియాడి మన భాద్యతను గుర్తుచేసుకుంటాం…

అమ్మలాగా దైవత్వాన్ని చూపుతుంది, సోదరిలాగా ఆత్మీయతను పంచుతుంది, భార్యలాగా కుటుంబానికి అనితం అవుతుంది, కుతురిలాగా ప్రేమానురాగాలతో ఆదరిస్తుంది, స్నేహితురాలుగా అందరిని అర్ధం చేసుకుంటుంది, అవును ఆమె అహర్నిశలు శ్రమించే ఇంటింటి దీపం మహిళా.

భాద్యత కోసం పోరాడుతుంది, బందం కోసం ఆరాటపడుతుంది, జననాన్ని ఇస్తుంది, గమనాన్ని చూపిస్తుంది, ప్రేమగా ఇంటి కోసం సర్వం త్యాగం చేస్తుంది మహిళా. ఒకప్పుడు స్త్రీలను దేవతలుగా పూజించిన దేశం మనది, మాత్రుస్వామ్య వ్యవస్థను గౌరవవించిన సమాజం మనది.

కాలక్రమేనా పితృస్వామ్య వ్యవస్థను తీసుకురావటమే కాకుండా, స్త్రీ లను ఇంటి నుండి బయటకు రానివ్వకుండా కట్టడి చేసారు. స్త్రీ కేవలం ఒక కుటుంబానికి, మరియు ఒక మగానికి సేవ చేస్తే చాలని ఇంటి పనులకు , వంట పనులకు పరిమితం చేసారు. మహిళల పై అన్యాయాలు , అరాచకాలు ఎక్కువ అవుతున్న నిర్లిక్తంగా ఉండిపోయారు, అందుకు మహిళలు హక్కులకోసం గర్జించారు.

మార్చి 8 ఒక చారిత్రాత్మక ప్రాధాన్యత గల రోజు… పది గంటల పని దినాల కోసం, పురుషులతో సమానమైన వేతనాల కోసం పశ్చిమ పెంసిల్వేన్య లోని ఒక బట్టల మిల్లులో సమ్మె ప్రారంభమైంది… ఇందులో 5000 మంది పాల్గొన్నారు, ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించింది ….

చివరకు 1857 మార్చి 8వ తేదిన ఈ సమ్మె విజయవంతం అయింది…
అందుకే ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించారు… ఐక్యరాజ్యసమితి కూడా మార్చి 8 వతేదిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా గుర్తుంచింది.

గడిచిన అర్దశతాబ్దంలో మహిళా స్థాయి మరియు మహిళలకు గౌరవం పెరిగింది కాని మహిళా సంఖ్యల పరంగా ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉన్నారు. ఇంట్లో నుండి మొదలైన ఈ వివక్ష, బయటకి వస్తే ఎన్నో ఇబ్బందులు, అడుగడుగునా పురుశాదిక్యత , అభద్రతా మహిళా పాలిట శాపాలుగా మారాయి… నిత్యం పోరాటం , అస్తిత్వం కోసం ఆరాటం మహిళలను నిరుత్సాహ పరుస్తూనే ఉన్నాయి.

రాజకీయ అదినేత్రులుగా దేశాన్ని పాలిస్తున్నారు, కార్పొరేట్ రంగంలో దూసుకుపోతున్నారు, వానిజ్యరంగంలో వెలుగొందుతున్నారు, క్రీడా రంగంలో కాంతులీడుతున్నారు వీళ్ళందరినీ చూస్తే గర్వంగా అనిపిస్తుంది, వీళ్ళు సాదించే విజయాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది కాని ఇంకా సామాన్య మహిళా మాత్రం ఎన్నో అగధాలాను దాటుతుంది.  కష్టాల కడలిని ఈదుకుంటూ ఉన్నత శికరలాను అదిరోహించడానికి ఆరాటపడుతుంది. అసమానత, అవమానాలు, అత్మన్యూడత

మహిళలను వేదిస్తునే ఉన్నాయి. ఆర్థికంగా కొంత శాతం మెర ఎదిగిన మానసికంగా మరియు సామాజిక పరంగా  మాత్రం మార్పు రావటం లేదు… 80% మహిళలు తమదైన చిన్న ప్రపంచానికి పరిమితం అవుతున్నారు, మరికొందరు సాదించిన దానితోనే తృప్తిగా అలానే ఉండిపోతున్నారు…

మహిళలను గౌరవిద్దాం…

#SrinivasCh #TeamCinemaizm

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *