SS Rajamouli Tweet on Geetha Govindam Movie

SS Rajamouli Tweet on Geetha Govindam Movie | SS Rajamouli Review on Geetha Govindam Movie.

గీత ఆర్ట్స్ బ్యానర్ , పరుశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవవరకొండ మరియు రష్మిక మందన్న హీరో హీరోయిన్లు గా కలిసి రూపొందించిన చిత్రం “గీత గోవిందం “.

ఈ చిత్రం విడుదలకు ముందే పైరసీ అవడం మనకు తెలిసిన విషయమే . ఇటీవలే విడుదల అయినా ఈ చిత్రం మొదటి షోతోనే మంచి సక్సెస్ టాక్ ని సంపాదించడంతో ఈ సినిమా యూనిట్ ఆనందానికి అంతులేకుండా పోయింది. ఇది ఇలా ఉండగా మన దర్శదీరుడు జక్కన్న ఎస్ ఎస్ రాజమౌళి గారు “గీత గోవిందం ” సినిమాను మరియు చిత్రబృందాన్ని అభినందించారు .

ఈ విషయాన్ని రాజమౌళి గారు ట్విట్టర్ వేదికగా ప్రశంసించడం గమనార్హం . “ఈ సినిమా ఒక మంచి నవ్వుల సందడిగా ఉంది , అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్ దేవరకొండ ఒక మంచి సినిమాని ఎంపిక చేసుకున్నాడు . ఎలాంటి సినిమాలు చేయాలో , ఎలాంటి క్యారెక్టర్ ని ఎంచుకోవాలో , ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడో అంతానికి ఒక మంచి స్పష్టత ఉంది . ఈ సినిమా మొత్తం చాలా చక్కగా మరియు చాలా సరదాగా సాగిపోతుంది.

పరుశురాం గారు ఈ సినిమాని చాలా సరియైన విధానంలో తెరకెక్కించారు. పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి సినిమాలతో మంచి పేరు సంపాదించుకున్న రాహుల్ రామకృష్ణ మరియు అన్నపూర్ణమ్మ , వెన్నెల కిశోరె తదితరులు చాలా అద్భుతంగా నటించారు. “గీతగోవిందం” చిత్ర బృందానికి నా అభినందనలు అని జక్కన్న గారు ట్వీట్ చేశారు .

ఇదే విధంగా మంచి టాక్ ని సొంతం చేసుకొని, మంచి కలెక్టన్స్ తో ఇంకా ముందుకి దూసుకెళ్లాలని మా #Cinemaizm తరుపున ఆశిస్తున్నాం.

rajamouli tweet on geetha govindam movie

Comment Below

comments

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *